Narender Vaitla |
Updated on: Jan 08, 2023 | 7:20 PM
ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్ సంస్థ నాయిస్ తాజాగా కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. నాయిస్ కలర్ బిట్ కాలిబర్ బజ్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌ను తక్కువ బడ్జెట్‌లో లాంచ్ చేయడం విశేషం.
ఈ స్మార్ట్ వాచ్‌ను స్క్వేర్ షేప్ డయాల్‌తో రూపొందించారు. వాచ్ డయల్‌ను 16.9 ఇంచెస్ సైజ్‌తో అందించారు. ఈ స్మార్ట్ వాచ్ జెట్ బ్లాక్, ఆలివ్ గ్రీన్, మిడ్ నైట్ బ్లూ, రోజ్ పింక్ కలర్లలో తీసుకొచ్చారు.
500 నిట్ బ్రైట్ నెస్ తో, టీఎఫ్టీ డిస్ ప్లే ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేకంగా చెప్పొచ్చు. డిస్ ప్లే రిజొల్యూషన్ విషయానికొస్తే 240×280 పిక్సెల్స్ గా ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా ఏడు రోజుల పాటు పనిచేస్తుంది.
ఇందులో హార్ట్ రేట్ మానిటరింగ్, యాక్టివిటీ లెవెల్ ట్రాకింగ్, ఎస్పీఓ2(SPO2) మెజరింగ్, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ ట్రాకింగ్, సైకిల్ ట్రాకింగ్, బ్రీత్ ప్రాక్టీస్ వంటి ఫీచర్లున్నాయి. అలాగే, డైలీ రిమైండర్లు, వెదర్ అప్ డేట్స్, స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్ డేట్స్ ను కూడా ఈ స్మార్ట్ వాచ్ అందిస్తుంది.
100 కు పైగా స్పోర్ట్స్ మోడల్స్, 150కి పైగా క్లౌడ్ బేస్డ్ ఫేసెస్‌తో వచ్చే ఈ వాచ్‌లో 5.2 బ్లూటూత్ కనెక్టివిటీ అందించారు. ధర విషయానికొస్తే ఈ వాచ్‌ను రూ. 1499కి అందుబాటులోకి తీసుకొచ్చారు.
Telugu cinema posters get a digital makeover! | Telugu Movie News TOI Etimes source
Comments
Post a Comment